ఏపీ మంత్రి అల్లుడికి సైబర్ మోసం తప్పలేదు.. ఏకంగా రూ.కోట్లలో మోసం జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి ఈ కేసులో నిందితుల్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. ఏపీ మంత్రి నారాయణ పెద్ద అల్లుడు పునీత్ ఓ కంపెనీ నడుపుతున్నారు. అక్కడ అకౌంటెంట్‌గా పనిచేసే ఉద్యోగికి పునీత్ పేరుతో వాట్సాప్‌కు ఓ మెసేజ్ వచ్చింది. తన బ్యాంక్ అకౌంట్‌కు అర్జెంటుగా రూ.1.96 కోట్లు పంపించమని ఆ మెసేజ్‌లో సారాంశం. అకౌంటెంట్ నిజం అనుకుని వెంటనే ఆ డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేశారు.
ఏపీ మంత్రి అల్లుడికి సైబర్ వల.. ఒక్క మెసేజ్‌తో రూ.1.96కోట్లు కొట్టేశారు
Published on: 23-08-2025