హైదరాబాద్

హైదరాబాద్ వాసులకు మరోసారి డేంజర్ బెల్స్.. ఈ ప్రాంత వాసులు జాగ్రత్త..

Published on: 12-08-2025

హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రధాన ఏరియాల్లోనే కాకుండా.. నగర శివారు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ వర్షాల కారణంగా నిత్య జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ద్విచక్ర వాహనదారులు ఆఫీసులకు వెళ్లే సమయంలో ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచించింది. మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Sponsored