విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' విడుదల కానున్న వేళ, చిత్ర బృందం పవన్ కళ్యాణ్ ను కలిసింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్ లో పవన్ కళ్యాణ్ ను కలిసి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కొత్త లుక్ లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.