cm revanth congratulates civil services achievers

సివిల్స్ టాపర్లకు సీఎం రేవంత్ అభినందనలు

Published on: 📅 07 Mar 2026, 12:47 PM
Reporter: 🖊 Anitha Sharma

సివిల్ సర్వీసెస్‌లో రాణించిన తెలుగు అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ పథకం ద్వారా సాయం పొందిన 20 మంది మంచి ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వం పేదల బిడ్డలు బర్లు, గొర్లు కాసుకుంటూ బతకాలని భావించిందని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం వారి విద్యకు ప్రాధాన్యం ఇచ్చి IAS, IPS అధికారులుగా ఎదగాలని ప్రోత్సహిస్తోందని ట్వీట్ చేశారు. వారు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

Sponsored