దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మరో నిరాశ ఎదురైంది. సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ ఆలస్యమవడంతో ఇప్పటికే సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఏప్రిల్ వరకు కూడా విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. కెనడా డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. 2026 ఏప్రిల్ 30కు ముందు ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదని స్పష్టం చేయడంతో ఫ్యాన్స్ మరింత నిరాశకు గురయ్యారు.