తెలుగు స్టార్ హీరోయిన్ శ్రీలీలకు తమిళంలో భారీ అవకాశం దక్కినట్లు సమాచారం. కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ నటిస్తున్న ‘AK64’ చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా, టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అజిత్ ‘AK64’లో శ్రీలీలకు ఛాన్స్… కోలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ
Published on: 📅 22 Feb 2026, 06:30