‘జైలర్-2’

‘జైలర్-2’ రిలీజ్ డేట్ ఫిక్స్?.. ఆగస్టు 21న థియేటర్లలోకి!

Published on: 📅 13 Feb 2026, 06:09

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జైలర్’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘జైలర్-2’ రిలీజ్ డేట్ ఖరారైనట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 21న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అదేవిధంగా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని టాక్. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sponsored