బంగ్లాదేశ్ 13వ పార్లమెంట్ ఎన్నికల లెక్కింపులో BNP స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 300 స్థానాల్లో 50 సీట్లలో ముందంజలో ఉండగా, జమాత్-ఎ-ఇస్లామీ కూటమి 18 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. మెజారిటీకి 151 సీట్లు అవసరం. షేక్ హసీన 15 ఏళ్ల పాలన అనంతరం జరిగిన ఈ ఎన్నికలు రాజకీయంగా కీలకంగా మారాయి. అవామీ లీగ్ పోటీలో లేకపోవడం పరిస్థితిని మార్చింది. అధికార ఫలితాలు ఇంకా రావాల్సి ఉండగా, తదుపరి గంటలు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.