కామెడీ జానర్‌లో ‘జాతిరత్నాలు’తో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు అనుదీప్, ఆ తర్వాత అదే స్థాయి హిట్ అందుకోలేకపోయారు. ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కించిన ‘ఫంకీ’ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 13న సినిమా విడుదల కానుండగా, ఈ మూవీ తనకున్న కామెడీ టైమింగ్‌ను మరోసారి చూపిస్తుందని అనుదీప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన దగ్గర ఇంకా చాలా కథలు ఉన్నాయని చెబుతున్న ఆయన, ‘ఫంకీ’తో మళ్లీ మ్యాజిక్ చేస్తారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.