IPL–2026లో

IPL–2026లో విశాఖకు మరోసారి మ్యాచ్‌ల అవకాశం

Published on: 📅 11 Feb 2026, 06:53

IPL–2026 సీజన్‌లో విశాఖపట్నం వేదికగా మ్యాచ్‌లు జరగనున్నట్లు సమాచారం. ACA–VDCA స్టేడియంలో కనీసం రెండు మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ స్టేడియాన్ని హోం గ్రౌండ్‌గా ఉపయోగించగా, అక్కడి పరిస్థితులు జట్టుకు అనుకూలంగా మారాయి. ఈ ఏడాది కూడా మ్యాచ్‌ల నిర్వహణపై ఆంధ్ర క్రికెట్ సంఘం ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంతో చర్చలు జరపగా, వారు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Sponsored