ఏపీ

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. జగన్ హాజరుపై ఉత్కంఠ

Published on: 📅 11 Feb 2026, 06:48

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్‌పై గవర్నర్ ప్రసంగం ఉండటంతో వైసీపీ చీఫ్ జగన్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. గత సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అనంతరం జగన్ సభ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ఈసారి పూర్తిస్థాయిలో పాల్గొంటారా అనే సందేహాలు నెలకొన్నాయి. హాజరైతే కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి, వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగే అవకాశం కనిపిస్తోంది.

Sponsored