ఎన్నికలకు

ఎన్నికలకు ముందే బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు

Published on: 📅 06 Feb 2026, 06:34

NRI

ఎన్నికలకు ఆరు రోజుల ముందు బంగ్లాదేశ్‌లో ఘర్షణలు చెలరేగాయి. దేశ సలహాదారు యూనస్ నివాసం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నేషనల్ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢాకాలోని షహీద్ మినార్ నుంచి యూనస్ నివాసానికి ర్యాలీగా వచ్చారు. లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వాటర్ క్యానన్స్, టియర్ గ్యాస్, సౌండ్ గ్రనేడ్లు ప్రయోగించగా, ఢాకా అంతటా భారీగా బలగాలను మోహరించారు.

Sponsored