2026 ఇండియన్ అమెరికన్ అటిట్యూడ్స్ సర్వేలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో పదవీకాలంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. కార్నెగీ ఎండోవ్మెంట్ విడుదల చేసిన ఈ సర్వే ప్రకారం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల నిర్వహణలో ట్రంప్ విధానాన్ని కేవలం 20 శాతం మంది మాత్రమే సమర్థించారు. 2020లో ఇది 35 శాతం కాగా, జో బైడెన్‌కు 2024లో 48 శాతం మద్దతు లభించింది. వాణిజ్యం, సాంకేతిక బదిలీలు, వ్యూహాత్మక సహకారం అంశాల్లో సమస్యలు పెరిగాయని, క్వాడ్ కూటమిపై కూడా ప్రభావం పడిందని సర్వే పేర్కొంది. 55 శాతం మంది అసమ్మతి వ్యక్తం చేయగా, 25 శాతం మందికి స్పష్టమైన అభిప్రాయం లేదు.