ట్రేడ్

ట్రేడ్ వార్స్ నడుమ భారత్ దూకుడు: GCC దేశాలతో FTA చర్చలు

Published on: 📅 06 Feb 2026, 02:48

ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్స్ కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ వరుస వాణిజ్య ఒప్పందాలతో ముందుకు సాగుతోంది. EU, USA తర్వాత ఇప్పుడు గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (GCC)లోని ఆరు దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌పై చర్చలు ప్రారంభించింది. ఈ ఒప్పందం కుదిరితే భారత ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరగనున్నాయి. ఇప్పటికే UAE, ఒమన్‌తో ఒప్పందాలు అమల్లో ఉండగా, సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, బహ్రెయిన్‌లతో వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి.

Sponsored