U-19 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇవాళ భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. జింబాబ్వేలోని హరారే వేదికగా మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ ఎడిషన్‌లో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరింది. టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ ఐదుసార్లు కప్ గెలిచింది. ఇంగ్లండ్ ఒక్కసారి మాత్రమే ఛాంపియన్ అయింది. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం స్టార్స్‌పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ఉంటుంది.