T20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కెప్టెన్ కమిన్స్ టోర్నీకి దూరమవ్వగా, తాజాగా కీలక బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా కొన్ని మ్యాచులకు అందుబాటులో ఉండరని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. కాలి మడమ నొప్పి గాయం నుంచి ఇంకా కోలుకుంటుండటంతో పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి సమయం పడుతుందని పేర్కొన్నారు. అతడి స్థానంలో రిజర్వ్ పేసర్‌గా సీన్ అబాట్‌కు అవకాశం ఇచ్చారు.