ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో టాపర్లుగా నిలిచే విద్యార్థులకు శుభవార్త లభించింది. స్టేట్ ర్యాంకర్‌కు రూ.5 లక్షలు, జిల్లా టాపర్లకు రూ.2 లక్షలు, నియోజకవర్గ, మండల టాపర్లకు రూ.10 వేల నగదు బహుమతులు అందజేస్తామని DRO వెంకటాచారి తెలిపారు. కలెక్టరేట్‌లో ‘చదువుకో తెలంగాణ’ గోడపత్రికను లక్డీకాపూల్‌లో ఆవిష్కరించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ పథకంతో మొత్తం రూ.2.2 కోట్ల బహుమతులు అందించనున్నట్లు వెల్లడించారు.