తిరుమలలో

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు షెడ్యూల్ ఖరారు

Published on: 📅 03 Feb 2026, 07:46

తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు నిర్వహించనున్నట్లు TTD ప్రకటించింది. ఫిబ్రవరి 26న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, 27న రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి, 28న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి తెప్పపై విహరిస్తారు. మార్చి 1, 2 తేదీల్లో మలయప్పస్వామి పుష్కరణిలో దర్శనమిస్తారు. ఈ సందర్భంగా కొన్ని ఆర్జిత సేవలను TTD రద్దు చేసింది.

Sponsored