రాష్ట్ర కేబినెట్ భేటీ ఈరోజు జరగనుంది. ఉదయం 10:30 గంటలకు అమరావతి సచివాలయం ఫస్ట్ బ్లాక్‌లో మంత్రులు సమావేశం కానున్నారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, 14వ తేదీన 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.