బంగారం–వెండి

బంగారం–వెండి ధరల షాక్: వాయిదా వేసినవారికి నిట్టూర్పు, పెట్టుబడులపై హడావిడి

Published on: 30-01-2026

బంగారం, వెండి ధరలు వరుసగా కొత్త రికార్డులు తాకుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘ఇక పెరగవు’ అన్న అంచనాలు పదే పదే తప్పుతున్నాయి. కొనుగోలును వాయిదా వేసుకున్నవారు అవకాశాలు చేజారిపోయాయని భావిస్తున్నారు. ధరలు వేల రూపాయల వరకు ఎగబాకడంతో అప్పు తీసుకుని అయినా పెట్టుబడి పెట్టాలన్న చర్చ పెరుగుతోంది. ఇదే సమయంలో పుత్తడి మీద బ్యాంకు లోన్లు తీసుకునేవారి సంఖ్య కూడా ఇటీవల గణనీయంగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ కదలికలు, ద్రవ్యోల్బణ భయాలు ధరలకు మద్దతుగా నిలుస్తుండటంతో జాగ్రత్తతో, దీర్ఘకాల దృష్టితో నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అత్యుత్సాహం దూరంగా పెట్టాలని హెచ్చరిస్తున్నారు కూడా.

Sponsored