మార్చి

మార్చి 31 నాటికి VJA బైపాస్ పూర్తి: కేంద్రమంత్రి గడ్కరీ

Published on: 30-01-2026

గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 17.88 కిలోమీటర్ల పొడవున చేపట్టిన విజయవాడ బైపాస్ ప్రాజెక్టు మార్చి 31 నాటికి పూర్తవుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. లోక్‌సభలో ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. మొత్తం ప్రాజెక్టులో 4 కిలోమీటర్ల మేర పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటిని నిర్ణీత గడువులో పూర్తి చేయడమే లక్ష్యమని తెలిపారు. 2019లో రూ.1,194 కోట్ల అంచనావ్యయంతో ఆరు వరసల బైపాస్‌కు అనుమతులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయి.

Sponsored