బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించబోయే సినిమాను వచ్చే నెలలో లాంచ్ చేయనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మాస్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుండగా, చిరంజీవి కూతురిగా కృతి శెట్టి లేదా అనస్వర రాజన్ నటిస్తారని టాక్. చిరు–బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.