మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఒక విమానం నియంత్రణ తప్పినట్లు సమాచారం. రన్‌వే మీదుగా జారిపోతూ పక్కకు దూసుకెళ్లిన విమానం కూలిపోవడంతో అందులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లైట్‌ను నియంత్రించడంలో పైలట్ పూర్తిగా విఫలమైనట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రమాదానికి గురైన Learjet 45 విమానాన్ని VSR సంస్థ నిర్వహిస్తోంది. ఈ విషాద ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.