ఇమ్రాన్

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై PTI ఆందోళన

Published on: 28-01-2026

అవినీతి ఆరోపణలతో మూడేళ్లుగా జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై PTI పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన తీవ్ర కంటి సమస్యతో బాధపడుతున్నారని, వెంటనే ఆస్పత్రిలో చికిత్స అందించకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. కోర్టు ఆదేశాలను జైలు సిబ్బంది పట్టించుకోవట్లేదని విమర్శిస్తూ, కుటుంబసభ్యులు, స్నేహితులను కలిసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది. తక్షణ వైద్య పరీక్షలు నిర్వహించి మానవీయతతో వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరింది. న్యాయం, మానవ హక్కులు, మానవీయ విలువలు కాపాడాలని కూడా విజ్ఞప్తి చేసింది.

Sponsored