మహారాష్ట్రకు

మహారాష్ట్రకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

Published on: 28-01-2026

విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కాసేపట్లో మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో అజిత్ పవార్ మృతికి మంత్రులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా అజిత్ పవార్‌తో తనకు ఉన్న పరిచయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ దుర్ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Sponsored