మూగజీవులకు విషమిచ్చి చంపడం దారుణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు. పలు చోట్ల వీధికుక్కలకు విషమిచ్చి చంపిన ఘటనలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. సమస్యకు పరిష్కారం చట్టబద్ధంగా, శాస్త్రీయంగా జరగాలని, సొంత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. RRలో 100 కుక్కలకు విషమిచ్చిన ఘటన వెలుగు చూసింది. కామారెడ్డిలో కోతులను చంపిన ఘటనలో పలువురిపై కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.