డైరెక్టర్ అనిల్ రావిపూడి తన కెరీర్‌లో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్‌లలో ‘భగవంత్ కేసరి’ ప్రత్యేకమని పేర్కొన్నారు. విడుదల సమయంలో చంద్రబాబు జైలులో ఉండటంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. సాధారణ ప్రేక్షకులు మూవీని హిట్ చేసారు. పరిస్థితులు బాగుంటే మరింత హిట్ అవుతుందని ఆయన చెప్పారు. ఈ మూవీకి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు లభించిందని కూడా ఆయన అన్నారు. సినిమాపై అభిమానుల్లో మంచి స్పందన నెలకొంది.