పల్నాడు

పల్నాడు జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

Published on: 22-01-2026

నేడు పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌లో కోటప్పకొండకు చేరుకుంటారు. ముందుగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మార్గమధ్యలో ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం కోటప్పకొండ-కొత్తపాలెం మధ్య రూ.3.9 కోట్లతో నిర్మించిన రోడ్డును ప్రారంభిస్తారు. తరువాత మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. భద్రత, ట్రాఫిక్, భక్తుల సౌకర్యాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వనున్నారు. ఈ పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. స్థానికుల్లో ఉత్సాహం నెలకొంది అని సమాచారం తెలిపారు.

Sponsored