దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. స్టీల్, విద్యుత్, విమానయాన రంగాల్లో మొత్తం రూ.19,500 కోట్ల పెట్టుబడులు ఖరారయ్యాయి. రూ.12,500 కోట్లతో రష్మి గ్రూప్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. స్లొవేకియా సంస్థ రూ.6 వేల కోట్ల పవర్ ప్లాంట్ నిర్మించనుంది. సర్గాడ్ సంస్థ రూ.1000 కోట్లతో ఫ్లైట్ రిపేర్ యూనిట్ స్థాపించేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ పెట్టుబడులు తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దిశ చూపనున్నాయి. ఉద్యోగ అవకాశాలు భారీగా పెరగనున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. అధికారిక వర్గాలు తెలిపాయి.