మున్సిపల్ ఎన్నికలు ఈసారి ఒకే విడతలో జరగనున్నాయి. ఇప్పటికే మున్సిపల్, పోలీస్ శాఖల నుంచి SEC అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ బల్దియా, వార్డులు ఏ వర్గాలకు రిజర్వ్ అయ్యాయో తుది ప్రకటన వెలువడనుంది. ఎన్నికల్లో పాల్గొననున్న ఇండిపెండెంట్ల కోసం నిన్న 75 గుర్తులను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. గతంలో సర్పంచ్ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.