APSRTCకు గవర్నెన్స్ నౌ 6వ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవార్డు లభించడం గర్వకారణం. బస్ స్టేషన్లలో బస్సుల రాకపోకలను ముందస్తుగా ప్రకటించే ఆధునిక విధానాన్ని అమలు చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినందుకు ఈ అవార్డును అందించారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని RTC చీఫ్ ఇంజినీర్ వై. శ్రీనివాస రావు స్వీకరించారు. గతంలోనూ APSRTCకు పలు కేంద్ర ప్రభుత్వ అవార్డులు, స్కోచ్ పురస్కారాలు లభించాయి. ఈ విజయం సంస్థ ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా మరింత పెంచింది ప్రజలలో విశ్వాసం మరియు సేవల నాణ్యతను మెరుగుపరిచింది.