సంక్రాంతి

సంక్రాంతి వేళ పెరగనున్న చలి తీవ్రత

Published on: 13-01-2026

సంక్రాంతి పండుగ సమయంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొమరిన్ తీర ప్రాంతాల సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ అనేక ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందని తెలిపింది. దీనివల్ల పగటి వేళ చల్లని వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. రేపటి నుంచి ఆకాశం నిర్మలంగా మారి చలి మరింత పెరుగుతుందని, నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వెల్లడించింది. నిన్న రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.

Sponsored