సంక్రాంతికి

సంక్రాంతికి విశాఖ–విజయవాడ మధ్య 12 జన సాధారణ్ రైళ్లు

Published on: 13-01-2026

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం–విజయవాడ మధ్య 12 జన సాధారణ్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రిజర్వేషన్ అవసరం లేకుండా ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. జనవరి 12, 13, 14, 16, 17, 18 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయి.

Sponsored