రాష్ట్రంలో పండగల వేళ మున్సిపల్ ఎన్నికల సందడి మొదలుకానుంది. మున్సిపల్ ఓటర్ల ఫైనల్ జాబితా విడుదల కావడంతో షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నాయి. ఈ నెల 20 నాటికి రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం SC, ST, డెడికేషన్ కమిషన్ ఆధారంగా BC రిజర్వేషన్లు ప్రకటించనుంది.