హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతోంది. బుధవారం తెల్లవారుజామున బడంగ్‌పేట్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 354కి చేరింది, డబుల్ డిజిట్ స్థాయి కంటే చాలా ఎక్కువ. శ్వాసకోశ సమస్యలున్నవారికి, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారికి, అలాగే సామాన్యులు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.