రాజధాని అమరావతిలో ఈసారి తొలి సారిగా గణతంత్ర వేడుకలు జరగనున్నారు. ప్రభుత్వం మంత్రుల బంగ్లాలకు ఎదురుగా 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేసింది. అదనంగా, పార్కింగ్ కోసం మరో పదెకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల్లో గవర్నర్ జస్టిస్ నజీర్, CM చంద్రబాబు, ఇతర అధికారులు, సుమారు 500 మంది అతిథులు పాల్గొననున్నారు. గతంలో ఈ వేడుకలు విజయవాడలో జరుగుతుండేవి.