సంక్రాంతి

సంక్రాంతి పండుగకు నాటుకోళ్లకు రేట్లు ఆకాశంలో

Published on: 08-01-2026

సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాటుకోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. గ్రామ దేవతలకు మొక్కులు, అతిథులకు వంటకాలు సిద్ధం చేయడమే ఆనవాయితీ. కేజీ కోడి ధర ప్రస్తుతం రూ.2,000–2,500గా పెరిగింది, గతంలో రూ.1,000–1,200 మాత్రమే ఉండేది. వైరస్‌ల కారణంగా పౌల్ట్రీ ఫార్మర్లు సంఖ్య తగ్గించడంతో కొరత ఏర్పడింది. బ్రాయిలర్ చికెన్ రేట్లు కూడా రూ.300–350 వద్ద ఉన్నాయి.

Sponsored