కాంగ్రెస్

కాంగ్రెస్ నేతల ప్రచార జోరు

Published on: 08-11-2025

ఖమ్మం, హైదరాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో పార్టీ నాయకులు విస్తృతంగా పాల్గొన్నారు. రహ్మత్‌నగర్ డివిజన్‌లో నిర్వహించిన ప్రచారంలో పొంగులేటి మాట్లాడుతూ... గత పాలకులపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అధికారంలోకి రావడానికి వేల మంది యువకుల చావులను ఉపయోగించుకున్నారని, కుమార్తె కవితను కూడా బయటకు పంపారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేసిందని, ఇప్పుడు అదే ఓట్ల కోసం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ముఖం చూపలేక కేవలం సీఎం వ్యవస్థాపకానికే పరిమితమయ్యారని విమర్శించారు. ఈ ప్రచారంలో పార్టీ నేత రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు.

Sponsored