ఉప్పల్‌లో

ఉప్పల్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య

Published on: 08-11-2025

హైదరాబాద్‌లోని ఉప్పల్ మల్లికార్జుననగర్‌లో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన పేరు శ్రీకాంత్, 2009 బ్యాచ్‌కు చెందిన ఈయన ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. శ్రీకాంత్ తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత నెల 23వ తేదీ నుండి అతను విధులకు హాజరు కాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగానే శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sponsored