మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామన్నారు. ఈ స్కీమ్ ప్రాజెక్టుకు రూ. 11,399 కోట్లు కేటాయించి, త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. రూ. 60,799 కోట్ల రోడ్ల నిర్మాణం రాష్ట్ర చరిత్రలో రికార్డు అని పేర్కొన్నారు. ముఖ్యంగా రూ. 10,400 కోట్లతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని 8 లైన్లకు విస్తరించనున్నట్లు తెలిపారు. రూ. 36 వేల కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం చేపడతామని అన్నారు. ఈ మేరకు నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.