దూర ప్రాంత గిరిజనులు పడుతున్న కష్టాలను చూసి ఓ యూట్యూబర్ వారికి సహాయం అందించారు. గ్రామానికి ముందున్న గెడ్డపై రూ. లక్షతో మినీ వంతెన నిర్మించి ఆపద్బంధువుగా నిలిచారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ములలావుపదర పంచాయితీ శివారు గాదెలవద్దకు వెళ్లాలంటే గ్రామం ముందున్న గెడ్డ దాటాలి. ఏకంగా పది నెలలు నీరు పారుతుంది. వంతెన లేక విద్యుత్తు స్తంభం ఏర్పాటు చేసి దానిపై రాకపోకలు సాగించేవారు. తుపానుకు స్తంభం కొట్టుకుపోవడంతో, విద్యార్థులు బడికి వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం ఎస్.కోటకు చెందిన యూట్యూబర్ రాసింగ్ నవీన్‌కు తెలియడంతో వంతెన నిర్మించాలని సంకల్పించారు. రూ. లక్ష ఖర్చు చేసి ఇనుప ఛానల్స్ వేసి, పైన పాత టైర్లతో మూడు అడుగుల వెడల్పైన