మ్యూజియం

మ్యూజియం కాదు.. ఇంజనీరింగ్ కాలేజ్

Published on: 08-11-2025

భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న వస్తువులను చూసి ఎవరైనా పాతకాలపు వస్తు ప్రదర్శనశాల (మ్యూజియం) అనుకుంటారు. కానీ, అది విద్యార్థులకు ప్రాచీన భారతీయ సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక మరియు కళా రంగాలకు సంబంధించిన విజ్ఞానాన్ని అందించే 'సృజనవాటిక' అనే విభాగం. రాజుల కాలం నాటి కట్టడాలు, నాణేలు, తాళపత్ర గ్రంథాలు, ఏనుగు దంతంతో చేసిన దువ్వెనలు వంటి వస్తువులను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (IKS) కార్యక్రమంలో భాగంగా, అరుదైన వారసత్వ సంపదను సేకరించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పండుగలు, ఆహార వ్యవహారాలను కూడా ఈ విభాగం ద్వారా తెలుపుతున్నట్లు నిర్వాహకుడు ఉడమలపల్లి సీతారామరాజు తెలిపారు.

Sponsored