మాలీలోని కోప్ట్రే ప్రాంతంలో విద్యుదీకరణ ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్న ఐదుగురు భారతీయులు కిడ్నాప్ అయ్యారు. గురువారం నాడు కొందరు దుండగులు అకస్మాత్తుగా దాడి చేసి ఈ ఉద్యోగులను అపహరించుకుపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే, అదే కంపెనీలో పనిచేసే మిగతా భారతీయులను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ కిడ్నాప్‌ను కంపెనీ ప్రతినిధులు ధృవీకరించినప్పటికీ, బాధితుల వివరాలను వెల్లడించలేదు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ సంస్థా ఎటువంటి ప్రకటనా చేయలేదు.