శ్రీశైలం

శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

Published on: 05-11-2025

అమ్రాబాద్ (నాగర్‌కర్నూల్ జిల్లా) వద్ద గల శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. అక్క మహాదేవి గుహలకు వెళ్లే మార్గం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బురదమయమైన ప్రదేశంలో ఇరుక్కుపోయిన బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. అందులోని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోయినా, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు గంటసేపు వాహనాలు నిలిచిపోయాయి. అదృశాల వెంటనే పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది చేరుకుని బస్సును రోడ్డు పైకి ఎక్కించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Sponsored