వేయిస్తంభాల

వేయిస్తంభాల గుడిలో కార్తీక శోభ

Published on: 05-11-2025

కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు హనుమకొండ జిల్లాలోని వేయి స్తంభాల గుడికి పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయం వెలుపల భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు. దీనితో ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. ఎక్కడ చూసినా దీపాల కాంతులు, భక్తుల సందడి నెలకొంది. ఈ పవిత్ర కార్తీక మాసంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Sponsored