కర్ణాటకలోని వాలీవీడ్ రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణవాసులు మృతి చెందారు. ఒక వ్యాన్ కారును ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగింది. మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40) గా గుర్తించారు. వీరంతా గంగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది.