నగర శివారు పోచారం ఐటీ కారిడార్‌లో కాల్పుల ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం గోసంరక్షక కార్యకర్త సోనుసింగ్పై వీరు కాల్పులు జరిపారు. గోవుల అక్రమ రవాణా సమాచారాన్ని సోనుసింగ్ హిందూ సంఘాలకు చేరవేయడం దీనికి కారణం. యమ్నపల్లి వద్ద ఇబ్రహీం అతనిని అడ్డుకుని, వాగ్వాదం పెరగడంతో సోనుసింగ్‌పై రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు. గాయపడిన సోనుసింగ్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు అతని కాలిలోంచి తూటాను తొలగించారు. ఈ కేసులో మరో నిందితుడు హసీబ్ ఖురేషీ పరారీలో ఉన్నాడు.