నిరుద్యోగ

నిరుద్యోగ సమస్య నివారణే ప్రభుత్వ లక్ష్యం

Published on: 23-10-2025

సూర్యాపేట కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఐటీ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నివారణే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 2వ తేదీన హుజూర్‌నగర్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లావారే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు దీనికి హాజరు కావచ్చని పేర్కొన్నారు. అనంతరం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Sponsored