బైక్‌ను

బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్ట‌ర్.. ఇద్దరు చిన్నారుల మృతి

Published on: 23-10-2025

రంగారెడ్డి జిల్లా యాచారంలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి తన ముగ్గురు కుమారులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా, ట్రాక్ట‌ర్ ఢీకొట్టింది. నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మృతులను అభిరామ్ (9), రాము (5)గా గుర్తించారు. తండ్రితో పాటు మరో బాలుడికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘోర ప్రమాదంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. రహదారులపై డ్రైవర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Sponsored