విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు నవంబర్ 15 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. టికెట్ ధర రూ. 8 వేలుగా నిర్ణయించారు. ఉదయం 7.45కు సింగపూర్ నుంచి విజయవాడకు చేరుకొని, 10.05 గంటలకు తిరుగు ప్రయాణం అవుతుంది. ఇది నాలుగు గంటల ప్రయాణం. ఈ సర్వీస్ తొలుత మంగళ, గురు, శనివారాల్లో నడుస్తుంది. డిమాండ్‌ను బట్టి రోజువారీగా నడపాలని సంస్థ యోచిస్తోంది. ఇప్పటికే టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి.